శనివారం 06 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:01:09

రెయిలింగ్‌ను ఢీకొట్టి లారీ బోల్తా

రెయిలింగ్‌ను ఢీకొట్టి లారీ బోల్తా

  • 19 మందికి గాయాలు
  • క్షతగాత్రులకు మంత్రి అల్లోల పరామర్శ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. నిర్మల్‌ జిల్లా కేంద్రం శివారులోని భాగ్యనగర్‌ వద్ద శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లేందుకు 70 మంది వలస కూలీలు హైదరాబాద్‌ నుంచి శుక్రవారం అర్ధరాత్రి లారీలో బయలుదేరారు.  శనివారం తెల్లవారుజామున భాగ్యనగర్‌ సమీపంలో లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన 9 మందిలో ఏడుగురికి నిర్మల్‌ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి వలస కూలీలతో మాట్లాడారు. అనంతరం నిర్మల్‌ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న క్షత్రగాత్రులను పరామర్శించారు.


logo