బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 06:35:33

బోల్తా పడ్డ వలస కూలీల లారీ

బోల్తా పడ్డ వలస కూలీల లారీ

నిర్మల్‌: జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముప్ఫై మంది వలస కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలతో వెళ్తున్న లారీ నిర్మల్‌ మండలంలోని కొండాపూర్‌ వద్ద బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 60 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని నిర్మల్‌ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ వలస కూలీలంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాద కారణాలను తెలుసుకుంటున్నారు.


logo