ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:46:15

ఆన్‌లైన్‌లో గణపతి హోమం

ఆన్‌లైన్‌లో గణపతి హోమం

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కారణంగా శుభకార్యాలు తగ్గిన నేపథ్యంలో పురోహితులు ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి పెట్టారు. ఆన్‌లైన్‌ ద్వారా శుభకా ర్యాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన దంపతులు వృత్తి రీత్యా కెనడాలో నివాసం ఉంటున్నారు. ఏటా హైదరాబాద్‌కు వచ్చి పూజలు చేయించే వారు. కరోనా కారణంగా ఈసారి కెనడా నుంచి రాలేక పోయారు. దీంతో వారు కోరి న విధంగా ఆదిలాబాద్‌లోని బ్రాహ్మణ వాడలో గల ఆలయంలో రుత్వికులు ప్రవీణ్‌శర్మ, మేఘరాజ్‌ శర్మ, కిరణ్‌ శర్మ, కృష్ణ శర్మ జూమ్‌ యాప్‌ ద్వారా శనివారం  నవగ్రహపూజ, గణపతి హోమం, మహా రుద్రాభిషేకం నిర్వహించారు.


logo