గంటకు 130 కిలోమీటర్లు

- ఇక బుల్లెట్ వేగంతో రైళ్ల పరుగు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కృషి చేస్తున్నది. కీలకమార్గాల్లో రైళ్ల వేగం గంటకు 130 కిలోమీటర్లు ఉండేందుకు అనువుగా 2,384 కి.మీ మేర ట్రాక్‌లను మెరుగుపర్చారు. జోన్ పరిధిలో 1,612 కి.మీ విస్తరించిన స్వర్ణ చతుర్భుజి- స్వర్ణ వికర్న (జీక్యూ-జీడీ) మార్గంలో 1,280 కి.మీ మార్గంలో ఇప్పుడు రైళ్లు గంట కు 130 కి.మీ గరిష్ఠ వేగంతో పరుగులు తీస్తున్నాయి. సిగ్నలింగ్ అభివృద్ధి పనులు జరుగుతున్న విజయవాడ-దువ్వాడ సెక్షన్ మిన హా.. మొత్తం జీక్యూ-జీడీ మార్గంలో వేగం గా రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా ట్రాకులను ఆధునీకరించారు. లక్నోకు చెందిన ఆర్డీఎస్వో సంస్థ ఆధ్వర్యంలో అన్ని తరగతుల కోచ్‌లు ఉన్న కన్ఫర్మేటరీ ఆసిలోగ్రాఫ్ కార్ రన్ (సీవోసీఆర్) ద్వారా గంటకు 130 కి.మీ వేగంతో ట్రయల్ రన్ నిర్వహించారు.
గరిష్ఠ వేగంతో రైళ్లు నడిచే మార్గాలు
- స్వర్ణ వికర్న(గ్రాండ్ట్రాక్) మార్గం 744 కి.మీ పరిధిలో బల్లార్ష-కాజీపేట మధ్య 234 కి.మీ. కాజీపేట-విజయవాడ- గుంటూరు వరకు 510 కి.మీ.
- స్వర్ణ చతుర్భుజి (చెన్నై-ముంబై సెక్షన్) లో 536 కి.మీ ఉండగా, దీని పరిధిలో రేణిగుంట- గుత్తి మధ్య 281 కి.మీ. గుత్తి - వాడివరకు 255 కి.మీ.
- గతంలో సికింద్రాబాద్-కాజీపేట మార్గం లో 132 కి.మీ హై డెన్సిటీ నెట్వర్క్(హెచ్డీఎన్)లో గరిష్ఠ వేగం గంటకు 130 కి.మీకు పెంచారు. ప్రస్తుతం అన్ని సెక్షన్ల లో రాను, పోను మొత్తం 2,824 కి.మీ.
సిబ్బంది కష్టఫలం
కొవిడ్ సమయంలోనూ నిర్దేశించిన పనులను సకాలంలో పూర్తిచేయడానికి అధికారులు, సిబ్బంది నిర్విరామంగా కష్టపడ్డారు. వారందరికీ అభినందనలు. స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్న, హై డెన్సిటీ మార్గంలో రైళ్ల వేగం పెరుగడం తో సర్వీసులను సులభంగా నిర్వహించవచ్చు. ప్రయాణ సమయం క్రమంగా తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది.
- గజానన్ మాల్యా, దక్షిణ మధ్య రైల్వే జీఎం
తాజావార్తలు
- టిక్‌టాక్‌పై శాశ్వత నిషేధం: కేంద్రం సంకేతాలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్‌హౌస్ ముందు బైడెన్‌కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్