హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘ఫైండ్ ఎక్స్పర్ట్ ఎండీ’ వెబ్సైట్ జాబితాలో ప్రముఖ గుండె వైద్యనిపుణుడు డాక్టర్ లోకేశ్వర్రావు సజ్జా (స్టార్ హాస్పిటల్)కు స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 283 మంది గుండె నిపుణులకు ఈ జాబితాలో చోటుదక్కగా అందులో ఈయన ఒకరు. భారత్ నుంచి ఐదుగురు ఉన్న ఈ జాబితాలో తెలుగువాడైన లోకేశ్వర్రావు ఒకరు.