సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:20:57

గోవర్ధనగిరిలో మిడతల కలకలం

గోవర్ధనగిరిలో మిడతల కలకలం

  • పరిశీలించిన శాస్త్రవేత్తలు

తొగుట: సిద్దిపేట జిల్లాలో చిన్న మిడతలు కలకలం రేపాయి. గతేడాది తొగుట మండలంలోని గోవర్ధనగిరి, వర్ధరాజ్‌పల్లి, ఘనపూర్‌, గుడికందులతోపాటు అల్వాల, అందే, మిర్‌దొడ్డి, చేగుంట మండలాల్లోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన మక్కజొన్న పంటను చిన్నమిడత(గడ్డి చిలుక)లు పీల్చి పిప్పిచేశాయి. తాజాగా ఇదే ప్రాంతంలో అవి కనిపించడంతో అప్రమత్తమైన తొగుట మండల వ్యవసాయాధికారి మోహన్‌ హైదరాబాద్‌లోని కేంద్రియ సమగ్ర సస్యరక్షణ కేంద్రం శాస్త్రవేత్తలకు సమాచారమిచ్చారు. 

బుధవారం శాస్త్రవేత్తలు డాక్టర్‌ సునిత, డాక్టర్‌ లోకేశ్‌కుమార్‌, డాక్టర్‌ ఉదయ్‌శంకర్‌ గోవర్ధనగిరిలో పర్యటించారు. పంట పొలాల్లోని గెట్ల వెంట మిడతలను గుర్తించారు. వీటి నివారణకు గట్ల మీద, బీడు భూముల్లో డెల్టామెత్రిన్‌ 2.8% ఈసీ 200 ఎంఎల్‌ 200 లీటర్ల నీటిలో లేదా లామ్‌డసైహలోత్రిన్‌ 50 % ఈసీ160 ఎంఎల్‌ 200 లీటర్ల నీటిలో లేదా మలాథియాన్‌ 50% ఈసీ 740 ఎంఎల్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.logo