e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలి : డీజీపీ

లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలి : డీజీపీ

లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలి : డీజీపీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లాక్‌డౌన్ అమలు తీరును శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌తో కలిసి డీజీపీ పర్యటించారు. చెక్‌పోస్టులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నగరంలోకి వచ్చే వాహనాలపై దృష్టిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు.. పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలి : డీజీపీ

ట్రెండింగ్‌

Advertisement