సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 12:13:41

లాక్‌డౌన్‌.. ప్రజలకు సూచనలు చేస్తున్న పోలీసులు

లాక్‌డౌన్‌.. ప్రజలకు సూచనలు చేస్తున్న పోలీసులు

కొమురంభీం అసిఫాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. నిన్న ప్రధాని పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో పాల్గొన్న యావత్‌ భారతావని విజయవంతం చేశారు. తదుపరి మార్చి 31 వరకు కొన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉంది. కాగా, ప్రజలు నిత్యావసర సరుకులు, వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రభుత్వం సూచనలు చేసింది. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తెల్లరేషన్‌ కార్డుదారులకు 1500 నగదు, 12 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా సరాఫరా చేయనుంది. 

ఇవాళ కొన్ని జిల్లాల్లో ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించకుండా, అనవసరంగా వాహనాలతో రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. కొన్ని చోట్ల అరెస్టు కూడా చేస్తున్నారు. దీంతో, ఆసీఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో వినియోగదారులకు, వ్యాపారులకు పోలీసులు అవగాహన కల్పించారు. అత్యవసరమైతే గాని బయటకు రాకూడదనీ, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో ఉండడమే మంచి మార్గమని పోలీసులు తెలిపారు. 

ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. స్వతహాగా ఇంట్లోనే ఉండి, ఈ విలువైన సమయాన్ని కుటుంబంతో పంచుకోవాలని సూచించారు. ప్రజలు సమూహాలుగా ఏర్పడకూడదని, సామాజికి దూరం పాటించాలని పోలీసులు ప్రజలకు తెలిజయేశారు. 


logo