బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 22:24:58

తెలంగాణలో ఈ 29 వరకు లాక్‌డౌన్‌

తెలంగాణలో ఈ 29 వరకు లాక్‌డౌన్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగింపు. ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజా ఈ నెల 29 వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం అనంతంరం సీఎం మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ... ఇంకొన్నాళ్లు ఓపికపడితే కరోనాను పూర్తిగా జయించవచ్చన్నారు. 65 ఏళ్లు దాటినవారు బయటకు రాకుండా చూడాలన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందన్నారు. రాత్రి 7 గంటల తర్వాత బయటకు వస్తే పోలీస్‌ చర్యలు తప్పవన్నారు.


logo