శనివారం 30 మే 2020
Telangana - May 17, 2020 , 23:18:31

నిరాడంబరంగా పెండ్లి వేడుక

నిరాడంబరంగా పెండ్లి వేడుక

ఆదిలాబాద్ :  పెళ్లంటేనే బంధువుల కోలాహలం, హంగూ ఆర్భాటాల మధ్య జరిగే అపురూపమైన వేడుక. కానీ ఈ జంటకు ఆ అదృష్టం లేకపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా కొద్దిమందితోనే ఈ తంతు ముగించాల్సి వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో అదే గ్రామానికి చెందిన సోలంకి నిఖిత, కోకస్‌మన్నూర్‌కు చెందిన నితిన్‌ల వివాహం ఆదివారం జరుగగా కేవలం 20మంది పెద్దలు హాజరయ్యారు. ఇరు కుటుంబాల నుంచి పెండ్లికి వచ్చిన అతిథులు మాస్కులను ధరించారు. వధువు, వరుడు కూడా మాస్కులను ధరించారు. కరోనా వైరస్‌ రావడం వల్ల మొదటిసారి సాదాసీదాగా పెండ్లి వేడుకలు జరిగాయని గ్రామ సర్పంచ్‌ మీనాక్షి, ఎంపీటీసీ సుభాశ్‌ గాడ్గె తెలిపారు.


logo