శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 10, 2020 , 17:45:57

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌

వరంగల్‌ : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పల్లెలే కాదు పట్టణ ప్రజలు సైతం ఏకమవుతున్నారు. కమిటీలు వేసుకుని దుకాణాలను మూసి వేసి లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో 331 మంది కరోనా బారిన పడినట్టు వైద్యఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 128 మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 125 మంది, మహబూబాబాద్ జిల్లాలో 21 మంది, జనగామ జిల్లాలో27, ములుగు జిల్లాలో 22, భూపాపలపల్లి జిల్లాలో 12 మంది కరోనా బారిన పడ్డారు.

కేసులు పెరుగుతుండడంతో స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే కరోనా మహమ్మారిని నియంత్రించవచ్చని భావించిన వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. దుకాణాలకు వచ్చే వారు కూడా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వ్యాపారులు కోరుతున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo