బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 17:13:50

నెలాఖరు వరకు కోర్టుల్లో లాక్‌డౌన్‌

నెలాఖరు వరకు కోర్టుల్లో లాక్‌డౌన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కోర్టుల్లో ఈ నెల 15 నుంచి దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని హైకోర్టు ఉపసంహరించుకుంది. ఈ నెల చివరివరకు జిల్లా కోర్టులు, ట్రైబ్యునళ్లు లాక్‌డౌన్‌ను కొసాగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికవమవుతుండటంతో అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నది.

కోర్టుల్లో ఈ నెల 15 నుంచి ఆగస్టు 8 వరకు దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని జూన్‌ 9న ప్రకటించింది. జిల్లా కోర్టుల్లో పరిమిత సంఖ్యలో కేసుల విచారణ చేపట్టాలని గతంలో సూచించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్‌డౌన్‌ జూన్‌ చివరి వరకు కొనసాగుతుందని, హైకోర్టులో ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే విచారణ కొనసాగనుందని పేర్కొంది.


logo