బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 23:37:17

31 వరకు లాక్‌డౌన్‌ హర్షణీయం: సీపీఐ

31 వరకు లాక్‌డౌన్‌ హర్షణీయం: సీపీఐ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా సీఎం కేసీఆర్‌ ఈ నెల 31 వరకు తెలంగాణలో లాక్‌డౌ న్‌ ప్రకటించడంపై సీపీఐ హర్షం వ్యక్తంచేసింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం, రేషన్‌ కార్డుకు రూ.1,500 ఆర్థికసాయం అందించనుండటం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల మంది కార్మికులు పనిలేక దినసరి భత్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో పేదలను ఆదుకునేలా సీఎం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమ ని చెప్పారు. సీఎం పిలుపునకు ప్రజలు సహకరించాలని, లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని వెంకట్‌రెడ్డి కోరారు. logo