సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 00:33:18

విత్తనసెజ్‌కు రుణాలు

విత్తనసెజ్‌కు రుణాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నదని నాబార్డ్‌ చైర్మన్‌ చింతల గోవిందరాజులు అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి నాబార్డ్‌ నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో విత్తనరంగ ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. దేశంలో విత్తన రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నేషనల్‌ సీడ్‌ ప్రాజెక్ట్‌ 1,2,3 మాదిరిగా ప్రాజెక్ట్‌-4ను కూడా తీసుకురావాల్సి ఉన్నదన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల మాదిరిగా విత్తన ఉత్పత్తిదారుల సంఘాలనూ ఏర్పాటుచేయాల్సి ఉన్నదన్నా రు. విత్తన ఎగుమతులను మరింత పెంచడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ లాంటి రాష్ర్టాలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం, విత్తన పరిశ్రమల తరఫున ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో విత్తన సెజ్‌లు ఏర్పాటుపై  ప్రతిపాదనలు వస్తే తక్కువ వడ్డీకి రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. దేశంలో తెలంగాణ సీడ్‌ హబ్‌గా పేరుగాంచిందన్నారు. సమావేశంలో తెలంగాణ విత్తన సంస్థల ఎండీ కేశవులు, నూజివీడు సీడ్స్‌ ఎండీ ప్రభాకర్‌రావు, కావేరి సీడ్స్‌ ఎండీ భాస్కర్‌రావు, సీడ్స్‌మెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎఫ్‌ఎస్‌ఐఐ డైరెక్టర్‌ జనరల్‌ రామ్‌ కొండన్య పాల్గొన్నారు.logo