శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 07, 2020 , 01:42:13

రుణమాఫీకి నిధులు మంచి పరిణామం

రుణమాఫీకి నిధులు మంచి పరిణామం

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులకు రూ.25 వేల వరకు ఉన్న రుణాలమాఫీకి నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం మంచి పరిణామమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగిస్తూనే ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లకు సడలింపులివ్వడం ఆహ్వానించదగినదన్నారు.


logo