లోన్‌యాప్ మాస్టర్‌మైండ్ అరెస్ట్

- పోలీసుల అదుపులో చైనీయుడు, యూపీ అకౌంటెంట్ కూడా
- ఖాతాల్లోని రూ.28 కోట్లు ఫ్రీజ్
- మొత్తం 24 యాప్‌ల నిర్వహణ
- 40% అధికవడ్డీ వసూలు టార్గెట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): జలగలు రక్తం పీల్చినట్టు ఆన్లైన్ రుణం పేరిట సామాన్యుడిని డబ్బు కోసం పీడించడమే రుణయాప్ నిర్వాహకుల లక్ష్యం. 40 శాతం అధికవడ్డీతో 24 యాప్‌లు నిర్వహిస్తున్న చైనీయుడితోపాటు యూపీకి చెందిన మరొకరిని బుధవా రం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టుచేశారు. వీరు నడిపిస్తున్న సంస్థల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.28 కోట్లను ఫ్రీజ్ చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి తాను తీసుకున్న రుణం మొత్తం చెల్లించినా అతడి ఖాతాలో పలు సంస్థలు ఇన్స్టంట్ రుణాల పేరిట డబ్బులు వేశాయి. తర్వా త వాటిని కట్టాలంటూ వేధించడం మొదలుపెట్టాయి. ముందుగా తీసుకున్న రూ.20 వేలకు రూ.లక్ష వరకు చెల్లించినా వేధింపులు తగ్గకపోవడంతో రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు పుణెలోని జియాలియాంగ్ ఇన్ఫోటెక్ కాల్‌సెంటర్ నుంచి వేధింపులు వస్తున్నట్టు గుర్తించి నిర్వాహకులైన పరుశురాం లహు టక్వీ, చైనాకు చెందిన అతని భార్య లియాంగ్ టియాన్, హెచ్చార్ మేనేజర్ అకీబ్షేక్ను అరెస్టు చేశారు. ఈ కాల్‌సెంటర్‌ను అజయ్ సొల్యూషన్స్ కోసం నిర్వహిస్తున్న ట్టు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. మరిం త లోతుగా దర్యాప్తు జరుపగా జియా లియాంగ్ ఇన్ఫోటెక్ సంస్థ.. అజయ్సొల్యూషన్స్, బీఏనాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎపోక్ గోక్రెడిట్ సొల్యూషన్స్, ట్రూతీగ్ ఫిన్‌టెక్ తదితర సంస్థలకు కాల్ సెంటర్‌గా పనిచేస్తున్నట్టు నిర్ధారించుకున్నారు.
ఇద్దరి నిందితులకు రిమాండ్
అజయ్ సొల్యూషన్స్ సంస్థపై మరింత నజర్ పెట్టగా చైనాకు చెందిన హెచ్ఈ జియాన్ అలియాస్ మార్క్ 2019లో బిజినెస్ వీసాపై భారత్ వచ్చి.. చైనీయులు నిర్వహిస్తున్న అజయ్ సొల్యూషన్స్‌తోపాటు ఎక్స్యూనాన్, క్సిన్చాంగ్, జాహో క్యూయోలతో కలిసి మైక్రోఇన్స్టంట్ లోన్‌యాప్స్ అభివృద్ధికి పనిచేయడం ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంకుర్సింగ్ను డైరెక్టర్‌గా పెట్టుకుని మొత్తం 24 లోన్‌యాప్స్‌ను నిర్వహిస్తున్నాడు. ఆర్బీఐ నిబంధనలు, ఎన్బీఎఫ్సీ మార్గదర్శకాలను పాటించకుండా ఆన్లైన్ రుణయాప్‌లను రూపొందించి దాదాపు 40 శాతం వడ్డీని బలవంతంగా వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన చైనా దేశస్థుడు హెచ్ఈ జియాన్, అజయ్ సొల్యూషన్స్ అకౌంటెంట్ వివేక్కుమార్ను బుధవారం రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైంఅదనపు డీసీపీ డీ శ్రీనివాస్, ఏసీపీ హరినాథ్, ఇన్స్పెక్టర్లు ప్రకాశ్, విజయ్‌కుమార్, సైబర్‌క్రైం సిబ్బందిని సీపీ మహేశ్ భగవత్ అభినందించారు. ఇప్పటివరకు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు రుణయాప్‌ల సంస్థలకు సంబంధించిన దాదాపు వారి ఖాతాల్లో 30 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు.
తాజావార్తలు
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ
- UPI యూజర్లకు గమనిక.. ఆ టైమ్‌లో పేమెంట్స్ చేయొద్దు
- టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!
- ఎఫ్బీ డేటా చోరీ.. కేంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ కేసు
- రెండోదశలో జర్నలిస్టులకూ కరోనా టీకా!
- పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం.. లక్ష్య టీజర్
- హరితేజకూ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు..!
- వరల్డ్ రికార్డ్.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో
- తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు