బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 23:34:37

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!

మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!

మధుమేహంతో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్న విషయమే. క్వీన్‌మేరీ యూనివర్శిటీ, గ్లాస్‌గౌ యూనివర్శిటీలు ఈ జాబితాకు ఇంకో సమస్యను చేర్చారు. టైప్‌-2 మధుమేహం ఉన్న వారిలో అత్యధికులు కాలేయ సంబంధిత లివర్‌సైరోసిస్‌లేదా కేన్సర్‌బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఈ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు చెబుతున్నరు. యూరప్‌లోని దాదాపు కోటీ ఎనభై లక్షల మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విలియం అలజవాయి తెలిపారు.

నాన్‌ఆల్కహాలిక్‌ఫ్యాటీ లివర్‌డిసీజ్‌అనేది వందలో పాతిక మందికి వచ్చే వ్యాధే అయినప్పటికీ దీనికి టైప్‌-2 మధుమేహానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని... చాలా సందర్భాల్లో దీన్ని ఎవరూ గుర్తించరని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి కాస్తా ముదిరి కాలేయం దెబ్బతినేందుకు కారణమవుతుంది. సకాలంలో ఇలాంటి రోగులను గుర్తించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మధుమేహం ఉన్న వారు మరింత జాగ్రత్తగా కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని తమ అధ్యయనం చెబుతోందని ఆయన వివరించారు


logo
>>>>>>