కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 65వ సినిమా నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ అండ్ మేకర్స్ టీం అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించింది. విజయ్ లేటెస్ట్ మూవీకి బీస్ట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. విజయ్ బ్లాక్ ప్యాంట్, షూస్ వేసుకుని వైట్ బనియన్ లో ఉన్న విజయ్ చేతిలో గన్ పట్టుకున్న స్టిల్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో చాలా కాలం తర్వాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది పూజాహెగ్డే. బీస్ట్ చిత్రం అదే టైటిల్‌తో తెలుగులో కూడా విడుదల కానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్.