సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 19, 2021 , 08:23:08

లీటర్‌ పెట్రోల్‌ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర

 లీటర్‌ పెట్రోల్‌ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర

హైదరాబాద్ : పెట్రోల్‌, డీజీల్‌ ధరలు రోజురోజుకు చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠసాయికి చేరిన ఇంధన ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజల్‌పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించడంతో పెట్రోల్‌ ధర రూ.85కు చేరింది. వారం వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో రూపాయికిపైగా పెరుగుదల నమోదుకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.20, డీజిల్‌ ధర 75.38కి చేరింది. ముంబైలో పెట్రోల్‌ రేటు రూ.91.56, డీజిల్‌ రేటు 81.87గా ఉన్నది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo