మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 23, 2020 , 21:17:34

అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోల పట్టివేత

అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోల పట్టివేత

కోరుట్ల ‌: కరోనా వైరస్‌ కట్టడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన క్రమంలో పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా రెండు వైన్‌ షాపుల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. త్రిశక్తి వైన్స్‌ నుంచి సుమారు రూ. 72 వేల మద్యం, శ్రీనివాస వైన్స్‌ నుంచి రూ. 12 వేల మద్యాన్ని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. 

నిబంధనలను అతిక్రమించి మద్యాన్ని తరలిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పట్టణంలో లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ రహదారులపై ఆటోలను నడిపిన పలువురు డ్రైవర్లును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం సహకరించాలని అవగాహన కల్పించారు.  logo
>>>>>>