సోమవారం 25 మే 2020
Telangana - Mar 31, 2020 , 19:43:30

ఏప్రిల్‌ 14 వరకు లిక్కర్‌ షాపులు, బార్లు బంద్‌

ఏప్రిల్‌ 14 వరకు లిక్కర్‌ షాపులు, బార్లు బంద్‌

హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ కట్టడికి దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వైన్‌ షాపులు, బార్లు,  కల్లు దుకాణాలు మూతపడ్డాయి. ఐతే వైన్‌ షాపులు తెరుస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఫేక్‌ జీవోలతో అసత్య ప్రచారం చేస్తుండటంతో ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు స్పందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు బార్లు, క్లబ్బులు, లిక్కర్‌ షాపులు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని  ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు.  

లాక్‌డౌన్‌ ప్రకటించకముందు మార్చి 31 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 14 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అప్పటి వరకు అన్ని మద్యం దుకాణాల బంద్‌ కొనసాగుతుందని  ఆయన చెప్పారు. మద్యం దుకాణాల బంద్‌ పక్కాగా అమలయ్యేలా చూడాలని ఎక్స్‌జ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. logo