శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 20, 2020 , 18:02:41

నేటి నుంచి 22వ తేదీ వరకు మద్యం షాపులు బంద్‌

నేటి నుంచి 22వ తేదీ వరకు మద్యం షాపులు బంద్‌

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 22వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. బల్క్‌ మేసేజ్‌లపై నిషేధం ఉంది. మున్సిపల్‌ కార్పోరేషన్లలో మొత్తం 12,898 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 120 మున్సిపాలిటీల్లో 2727 వార్డులకు 6325 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 కార్పోరేషన్లలోని 325 డివిజన్లకు 1586 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌తో పాటు వీడియో రికార్డింగ్‌ ఉంటుంది. వెబ్‌ కాస్టింగ్‌ లేని పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 22వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమలు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. బల్క్‌ మేసేజ్‌లపై నిషేధం ఉంది. మున్సిపల్‌ కార్పోరేషన్లలో మొత్తం 12,898 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 120 మున్సిపాలిటీల్లో 2727 వార్డులకు 6325 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 కార్పోరేషన్లలోని 325 డివిజన్లకు 1586 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌తో పాటు వీడియో రికార్డింగ్‌ ఉంటుంది. వెబ్‌ కాస్టింగ్‌ లేని పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.


దొంగ ఓట్లు వేయకుండా ఫేజ్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో తెలుపురంగు బ్యాలెట్‌ పేపర్‌ను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల విధల్లో 44వేల మంది సిబ్బంది, ఉద్యోగులు, పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఇద్దరు పోలీసులు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్‌ పద్దతిలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్‌ స్లిప్‌లను నా ఓటు యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 53,36,505 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 26,71,694 మంది పురుష ఓటర్లు, 26,64,557 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6 లక్షల 40వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా జనగామ జిల్లాలో 39,729 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2727 వార్డులకు గాను 77 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ, మూడు వార్డుల్లో ఎంఐఎం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. 


logo