మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:27

మూడ్రోజులు ఓ మోస్తరు వర్షాలు

మూడ్రోజులు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో, ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ మూడింటి ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.logo