శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 06:24:18

ఇవాళ‌, రేపు మోస్త‌రు వాన‌లు

ఇవాళ‌, రేపు మోస్త‌రు వాన‌లు

హైద‌రాబాద్‌: బ‌ంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి స‌మీపంలో 3 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. దీంతో రాష్ట్రంలో అక్క‌డ‌క్క‌డ ఇవాళ‌, రేపు మోస్త‌రు వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. రాత్రిపూట ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతుండ‌టంతో చ‌లి అధిక‌మ‌వుతున్న‌ది. నిన్న ఉద‌యం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెద‌రిలో అత్య‌ల్పంగా 12.4 డిగ్రీలు న‌మోద‌య్యింది. ఆదిలాబాద్ జిల్లాలో 12.8 డిగ్రీలు, జ‌న‌గామ‌లో 13.3, సిరిసిల్ల‌లో 13.6, వ‌రంగ‌ల్ రూర‌ల్‌, నిర్మ‌ల్‌‌, కామారెడ్డి జిల్లాల్లో 13.9 డిగ్రీలు న‌మోద‌య్యింది.