మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 06:47:55

నేడు, రేపు మోస్తరు వర్షాలు

నేడు, రేపు మోస్తరు వర్షాలు

హైద‌రా‌బాద్: ఉత్తర మధ్య‌ప్ర‌దేశ్‌ మధ్య ప్రాంతం, ఆ పరి‌స‌రా‌లను ఆను‌కుని దక్షిణ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రాంతాల్లో తీవ్ర అల్ప‌పీ‌డనం కొన‌సా‌గు‌తు‌న్నది. దీనికి అను‌బం‌ధంగా 7.6 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ఉన్నది. మరో‌వైపు, ఉత్తర కోస్తా తమి‌ళ‌నాడు నుంచి కొమొ‌రిన్‌ ప్రాంతం దాకా 0.9 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉత్త‌ర–‌ద‌క్షిణ ద్రోణి కొన‌సా‌గు‌తు‌న్నది. 

వీటి ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని చాలా‌చోట్ల ఈరోజు తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం వెల్ల‌డించింది. రేపు అక్క‌డ‌క్కడ వర్షం కురిసే అవ‌కాశం ఉన్నట్లు తెలిపింది. ఈరోజు గ్రేట‌ర్‌ హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు కురు‌వొ‌చ్చని పేర్కొన్న‌ది.


logo