సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 03, 2020 , 07:26:58

రెండురోజులు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వాన‌లు

రెండురోజులు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వాన‌లు

హైద‌రా‌బాద్: రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కుర‌వ‌ను‌న్నాయి. ఉత్తర బంగా‌ళా‌ఖా‌తంలో మంగ‌ళ‌వా‌రం‌నా‌టికి అల్ప‌పీ‌డనం ఏర్పడే అవ‌కా‌శా‌లు‌న్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ప్ర‌క‌టించింది. నైరుతి ప్రభా‌వంతో రాష్ట్ర‌వ్యా‌ప్తంగా సోమ, మంగ‌ళ‌వా‌రాల్లో చాలా‌చోట్ల ఉరు‌ములు మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొ‌న్న‌ది. మంగ‌ళ‌వారం ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని వెల్ల‌డిం‌చింది. నైరు‌తికి అల్ప‌పీ‌డనం కూడా తోడ‌వ‌డంతో వచ్చే మూడు‌రో‌జులు గ్రేట ర్‌ హైద‌రా‌బా‌ద్‌‌లోని పలు‌చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని తెలిపింది. శని‌వా రం ఉదయం నుంచి ఆది‌వారం ఉదయం వరకు రాష్ట్రంలో అత్య‌ధికంగా మహ‌బూ‌బా‌బాద్‌ జిల్లా డోర్న‌క‌ల్‌లో 11 సెంటీ‌మీ‌టర్ల వర్ష‌పాతం నమో‌దైంది.


logo