గురువారం 02 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 16:17:30

మొక్కలతోనే జీవకోటికి ప్రాణవాయువు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మొక్కలతోనే జీవకోటికి ప్రాణవాయువు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ : మొక్కలు నాటడంతోనే జీవకోటికి కావాల్సినంత ప్రాణవాయువు అందుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. పెద్దేముల్‌ మండలం దుగ్గాపూర్‌ గ్రామ శివారులోని ప్రభుత్వ అటవీ భూమిలో అటవీశాఖ వారి ఆధ్వర్యంలో ఆరో విడత హరితహారంలో భాగంగా.. స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృక్ష, జంతుజాలానికి కావాల్సిన ప్రాణవాయువు మొక్కల నుండే లభ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు విధిగా కనీసం ఐదు మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ప్రభుత్వం అడవుల శాతం పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతుంద న్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి కోరారు.


logo