బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 02:35:43

కూతురిని చంపిన తండ్రికి యావజ్జీవ శిక్ష

కూతురిని చంపిన తండ్రికి యావజ్జీవ శిక్ష

జగిత్యాల క్రైం: కట్న కానుకలిచ్చి పెండ్లి చేయాల్సి వస్తుందని కన్న బిడ్డనే చంపిన తండ్రి, అతనికి సహకరించిన పినతల్లితోపాటు మరొకరికి జగిత్యాల జిల్లా కోర్టు యావజ్జీవ శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.12 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. గొల్లపెల్లి మండలం వెనుగుమట్లకు చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డికి పెగడపల్లి మండలం మద్దులపెల్లికి చెందిన కల్లెం ప్రేమలతతో 30 ఏండ్ల క్రితం పెండ్లయింది. వీరికి మౌనశ్రీ(22) కూతురు ఉన్నది. కూతురు పుట్టిన మూ డేండ్లకే భార్యభర్తలు విడిపోయారు. మౌనశ్రీ పెండ్లి బాధ్యత తండ్రిదేనని విడాకుల సమయంలో ఒప్పం దం చేసుకున్నారు. అనంతరం సత్యనారాయణరెడ్డి లత అనే మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు.  ఈ క్రమంలో మౌనశ్రీకి పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. 2015లో హైదరాబాద్‌కు చెందిన సంబంధం వచ్చిందనీ, వారు కట్నకానుకలు ఎక్కువగా అడిగారని మౌన శ్రీ ఫోన్‌లో తండ్రికి చెప్పింది. పెండ్లి గురించి మాట్లాడేందుకు గ్రామానికి రావాలని తండ్రి 2015 సెప్టెంబర్‌ 7న మౌనశ్రీకి చెప్పాడు. మరుసటి రోజు మౌనశ్రీ తండ్రి వద్దకు వెళ్లింది.  తర్వాత రోజు  మౌనశ్రీ మృతిచెందిందని ఓ వ్యక్తి ఫోన్‌లో ఆమె తల్లికి సమాచారం అందించాడు. ప్రేమలత అక్కడికి వెళ్లేసరికి ఇంట్లోని ఓ గదిలో మౌనశ్రీ విగతజీవిగా పడిఉన్నది. తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి ధర్మపురి సీఐ వెంకటరమణ కేసు న మోదు చేసి విచారణ జరిపారు. కూతురి పెండ్లికి డబ్బు లు ఇవ్వడం ఇష్టంలేక తండ్రే రెండో భార్యతో కలిసి గొంతునులిమి చంపారని పోలీసులు పక్కా సాక్ష్యాధారాలను  సేకరించి కోర్టుకు సమర్పించారు. నేరం రుజు వు కావడంతో జగిత్యాల సెకండ్‌ అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి సుదర్శన్‌ బుధవారం తీర్పునిచ్చారు.