బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 04, 2020 , 00:21:50

లైంగికదాడి నిందితులకు యావజ్జీవం

లైంగికదాడి నిందితులకు యావజ్జీవం

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ: ఓ బాలికపై సామూహికంగా లైంగికదాడి చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సంగారెడ్డి ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ స్పెషల్‌ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మం డలం ఐనాపూర్‌కు చెందిన శివరాత్రి వెంకటేశ్‌(21), రాయపోలు మండలం పెద్ద ఆరెపల్లికి చెందిన మానకొండ శ్రీరామ్‌(24),నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన శివరాత్రి ఆంజనేయులు(21) కలిసి 2019 మే 15 రాత్రి 11 గంటల సమయంలో జగదేవ్‌పూర్‌ మండలంలో ని ఓ గ్రామానికి చెందిన 16 ఏండ్ల బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకెళ్లి, తిమ్మాపూర్‌ శివారులో లైంగికదాడి చేశారు. మరుసటి రోజు బాధితురాలు జగదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను గుర్తించి అదే నెల 19న అరెస్టు చేశారు.  నేరం రుజువు కావడంతో సంగారెడ్డి ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ స్పెషల్‌ కోర్టు  జడ్జి బీ పాపిరెడ్డి ముగ్గురికీ యావజ్జీవ కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని గజ్వేల్‌ ఏసీపీ నారాయణ తెలిపారు.


logo