హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ ఇఫ్కో ఎండీ డాక్టర్ యూఎస్ అవస్థికి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. వ్యవసాయరంగ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి రే వన్ అనే అగ్రి సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్ రెండో తేదీన హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ అగ్రి బిజినెస్ సమ్మిట్‌లో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన అగ్రి సంస్థల ప్రముఖులు హాజరుకానున్నారు. ఇఫ్కో ఇటీవలే ప్రపంచంలో తొలిసారిగా నానో (ద్రవ రూపం) యూరియాను తయారుచేసింది.