మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:31:53

సౌదీలో చేపూర్‌ వాసికి విముక్తి

సౌదీలో చేపూర్‌ వాసికి విముక్తి

  • మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో త్వరలో ఇంటికి

ఆర్మూర్‌: ఆరేండ్లుగా సౌదీలో యజమాని చేతి లో చిత్రహింసలకు గురవుతున్న అంకమొల్ల రవి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో సురక్షితం గా బయటపడ్డాడు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం చేపూర్‌కు చెంది న రవిని స్వగ్రామానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయుల హక్కులు, సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ద్వారా మాజీ ఎంపీ కవితకు విజ్ఞప్తి చేశారు. స్పందించిన కవిత.. రవిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ఆచారి, జాగృతి సౌదీ శాఖ అధ్యక్షుడు ఇఫ్తేకార్‌కు సూచించారు. రవిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోను సౌదీ రాయబారి డాక్టర్‌ ఔసప్‌ సయ్యద్‌ అక్కడి పోలీసులకు పంపడంతో వారు యజమానిని అదుపులోకి తీసుకుని రవిని రక్షించారు.  పాస్‌పోర్ట్‌, ఎగ్జిట్‌ వీసా, జీతం బకాయిలు ఇప్పించి రవిని జెడ్డాలోని ఓ గదిలో సురక్షితంగా ఉంచారు. విమాన సర్వీసులు ప్రారంభం కాగానే రవిని ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత, నర్సింహనాయుడు, హెచ్‌ఆర్‌సీ అధికారి శ్రీనివాస్‌రావుకు రవి భార్య సుజాత, రవి సోదరుడి కుమారుడు అజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. 


logo