e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home News బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను గ్రామాల్లో తిరగనివ్వం

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను గ్రామాల్లో తిరగనివ్వం

సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అధ్యక్షులు బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డిలు తీసుకురావాలని లేని పక్షంలో గ్రామాల్లో వారిని తిరుగనివ్వమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో రూ.4 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పునరుద్ధరణ(చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ధూళిమిట్ట వరకు), ఆకునూరులో కిలో మీటర్‌ సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుంకరి మల్లేశంతో కలిసి శంకుస్ధాపన చేశారు.


అనంతరం సర్పంచ్‌ చీపురు రేఖఅధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తెలంగాణ అభివృద్ధికి కోసం కోట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి రేవంతర్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు కేంద్రాన్ని నిలదీయరని ప్రశ్నించారు. తెలంగాణకు సమకూరుతున్న నిధులతో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులు నిర్మించి గురుకులాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత కరెంటు ఇవ్వడం, సాగు, తాగు నీరు అందించడం, చెరువులకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -


దీంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇచ్చి వారికి తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా ఉంటున్నట్లు తెలిపారు. తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించి డబ్బుల్లో న్యాయపరంగా రావాల్సిన రూ.లక్షా 40వేల కోట్లను బీజేపీ ఇవ్వకుండా వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు కేటాయిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు తెలిపారు.


కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు నిధులు మంజూరు చేస్తే 60 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాలో త్వరలో ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

భర్త వద్దంటే పనికి వెళ్లాడని భార్య ఆత్మహత్య

ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు

దారుణం : రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం

Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana