చేసిన అభివృద్ధిని చెబుదాం..టీఆర్ఎస్ను గెలిపిద్దాం

మహబూబాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుల కోసం అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారు. మన పట్టభద్రులు అందరూ రైతు బిడ్డలే. ఎమ్మెల్సీ ఎన్నిల్లో టీఆర్ఎస్కే మద్దతు పలుకుతారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని కేసముద్రం, గూడూరు మండలాల ఆధ్వర్యంలో కేసముద్రంలో నిర్వహించిన వరంగల్ - ఖమ్మం - నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
ఎన్నికలు ఫిబ్రవరి చివర్లో గాని, మార్చి మొదట్లో గాని రావొచ్చు. మహబూబాబాద్ నియోజక వర్గంలో అందరి కృషి, సహకారంతో 13 వేల మంది పట్టభద్రులను నమోదు చేయించామన్నారు. ఓటరు నమోదులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసిన, చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటింగ్ రోజు అందరూ పోలింగ్ బూత్‌కు వచ్చి టీఆర్ఎస్కు ఓటు వేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
మహబూబాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. గిరిజన యునివర్సిటీని కేంద్రం వెంటనే ప్రారంభించాలన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండో సారి ఎమ్మెల్సీగా మన ముందుకు మన ఆశీర్వాదం కోసం వస్తున్నారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు