గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 18:05:07

ఓట‌మిని స‌మీక్షించుకొని లోపాల‌ను స‌వ‌రించుకుంటాం : హరీశ్‌రావు

ఓట‌మిని స‌మీక్షించుకొని లోపాల‌ను స‌వ‌రించుకుంటాం : హరీశ్‌రావు

హైదరాబాద్‌ ... దుబ్బాక ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని రాష్ట్ర మంత్రి, దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార బాధ్యులు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు. ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. తమ లోపాలను సవరించుకుంటామన్నారు. దుబ్బాక ప్రజా సేవకు నిరంతరం అందుబాటులో ఉంటామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు, కార్యకర్తలకు అన్ని విధాలా సహకరిస్తామని హరీశ్‌ పేర్కొన్నారు.