గురువారం 04 జూన్ 2020
Telangana - May 10, 2020 , 16:34:06

'ప్రతి ఆదివారం నిల్వ నీటిని తొలగిద్దాం'

'ప్రతి ఆదివారం నిల్వ నీటిని తొలగిద్దాం'

హైదరాబాద్‌ : ఇక నుంచి ప్రతి ఆదివారం ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఉన్న నిల్వ నీటిని తొలగిద్దామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఇంటి పరిసర ప్రాంతాలను మంత్రి స్వయంగా శుభ్రపరిచారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఖాళీ చేయాలన్నారు. పిచ్చమొక్కలు, గుబురుగా పెరిగిన ఎప్పటికప్పుడు తీసేయాలన్నారు. ఇంటికి సంబంధించిన నీళ్ల ట్యాంకులను శుభ్రం చేసుకోవాలన్నారు. వ్యాధులకు కారణమయ్యే దోమలను పారదోలుదామని పేర్కొన్నారు.

సీజనల్‌ వ్యాధుల నివారణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో శుభ్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలను శుభ్రం చేసుకుందాం.. దోమల వల్ల వచ్చే మలేరియా వ్యాధి వ్యాప్తిని నివారిద్దామని మంత్రి పేర్కొన్నారు.logo