శనివారం 04 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 15:33:13

ఆకుపచ్చని తెలంగాణ కోసం పాటుపడుదాం

ఆకుపచ్చని తెలంగాణ కోసం పాటుపడుదాం

గద్వాల : మానవ మనుగడకు ప్రాణాధారమైన మొక్కలను ప్రతి ఒక్కరు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్య్రమాన్ని జిల్లాలో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, కార్యదర్శులు, ప్రజలు కలిసికట్టుగా మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకుపచ్చని గద్వాలకు ప్రతి ‌ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లాలో మల్దకల్ మండలం పెద్దపల్లె గ్రామంలో‌ రైతు వేదిక నిర్మాణానికి మంత్రి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ. 22 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టే హరిత వేదిక భవనానికి మంత్రి భూమిపూజ చేశారు.


logo