బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 09:46:37

కరోనా కట్టడికి కలిసికట్టుగా పొరాడుదాం : మంత్రి అల్లోల‌

కరోనా కట్టడికి కలిసికట్టుగా పొరాడుదాం : మంత్రి అల్లోల‌

నిర్మ‌ల్ : మ‌హామ్మారి కరోనా కట్టడికి కలిసికట్టుగా పోరాడాల‌ని రాష్ర్ట అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ఉదయం నిర్మల్ ప‌ట్ట‌ణంలోని ఎన్టీయార్ స్టేడియంలో మంత్రి రైతు బ‌జార్, ఏరియా ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డును ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా  కూర‌గాయలు విక్ర‌యిస్తున్న రైతుల‌తో మాట్లాడారు. కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూరగాయలు, ఆకు కూర‌లు సోషల్ డిస్టెన్స్  ను పాటించి, మున్సిపల్ వారు గీసిన గీతలో వుండి కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. శానిటైజ‌ర్ల‌ను, మాస్కుల‌ను మార్కెట్ లో అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం  కిరాణ షాపుల‌ను ప‌రిశీలించారు. అక్క‌డి నుంచి  ఏరియా ఆసుప‌త్రికి వెళ్లి ఐసోలేష‌న్ వార్డును ప‌రిశీలించారు.


ఈ సంద‌ర్బంగా  మంత్రి మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను ప్రజలందరూ పాటించి, ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ సమయంలోనే ప్రజలు బయటకు వచ్చి వారికి కావాలసిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రజల రద్దీ దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్టీయార్  క్రీడా మైదానంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా సామాజిక దూరం పాటించి లాక్ డౌన్ లో పాల్గొనాలని, కర్ఫ్యూ సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు.  ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీ, మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, నిర్మ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ధ‌ర్మాజీ రాజేందర్, రాంకిష‌న్ రెడ్డి, ల‌క్కిడి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

logo