ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 12:59:32

త్వ‌ర‌గా వైర‌స్ నిర్ధార‌ణ చేద్దాం.. మ‌ర‌ణాల‌ను అరిక‌డ‌దాం : మంత్రి ఈట‌ల రాజేంద‌ర్

త్వ‌ర‌గా వైర‌స్ నిర్ధార‌ణ చేద్దాం.. మ‌ర‌ణాల‌ను అరిక‌డ‌దాం : మంత్రి ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్‌ను త్వ‌ర‌గా నిర్దార‌ణ చేసి మ‌ర‌ణాల‌ను అరిక‌డ‌దామ‌ని రాష్ర్ట వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. రాష్ర్ట వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ సూపరింటెడెంట్‌లు, సిబ్బందితో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో వైద్యారోగ్య‌శాఖ కార్యదర్శి రిజ్వే, డీఎంఈ రమేష్ రెడ్డి, వీసీ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ...  డైట్ కాంట్రాక్టర్స్ బకాయిలు అన్నీ చెల్లిస్తామ‌ని తెలిపారు. ఐసోలేష‌న్ సెంట‌ర్ల‌ను మొద‌లు పెట్టాల్సిందిగా సూచించారు. శానిటేష‌న్‌, పేషంట్ కేర్ ప్రొవైడర్స్, లాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ స్టాఫ్ లో అవసరమైన సిబ్బందిని అనుమతి తీసుకొని నియమించుకోండ‌న్నారు. అన్ని ఆసుపత్రులకు ఆక్సిజేన్ సిలెండర్ల‌ను తాము హైద‌రాబాద్ నుంచే పంపిస్తామ‌ని తెలిపారు. 


logo