సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 16:17:02

ఆత్మస్థైర్యంతో కరోనాకు చెక్ పెడదాం : మేయర్ బొంతు రామ్మోహన్

ఆత్మస్థైర్యంతో కరోనాకు చెక్ పెడదాం : మేయర్ బొంతు రామ్మోహన్

హైదరాబాద్ : కరోనాతో ప్రపంచం వణికిపోతున్నది. ఎప్పుడు మహమ్మారి ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి. ఇక పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఆ భయం రెట్టింపు అవుతున్నది. అయితే కరోనా పాజిటివ్ గా తేలితే భయపడాల్సిన పని లేదంటున్నారు హైదరాబాద్  మేయర్ రామ్మోహన్. డాక్టర్ల సలహాలు పాటించి కరోనాను జయించవచ్చన్నారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఇంట్లోనే వ్యాయామం చేస్తూ, ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నానని మేయర్ తెలిపారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పౌష్టికాహారం, వ్యాయామంతో కరోనాను జయించవచ్చన్నారు.logo