గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 12:07:20

కరోనా పట్ల జాగ్రత్తగా ఉందాం..

కరోనా పట్ల జాగ్రత్తగా ఉందాం..

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌.. రాష్ట్రంలోకి కూడా చొరబడింది. ఈ మహమ్మారి వైరస్‌ బారినపడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ లో భాగంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్పి వచ్చింది.  కాగా, అంబర్‌పేట్‌ నియోజకవర్గంలోని బాగ్‌ అంబర్‌పేట్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌.. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి ప్రతి వార్డు కలియదిరుగుతూ కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. 

వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. అనునిత్యం పరిశుభ్రంగా ఉండాలనీ.. ఇంటి పరిసరాలు సైతం శుభ్రపరుచుకోవాలన్నారు. ముఖ్యంగా చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు నిత్యావసరం సరుకులు పంపిణీ చేశారు. logo
>>>>>>