శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 17:36:34

పాల ఉత్పత్తిలో ఆదిలాబాద్‌ను అగ్రభాగాన నిలుపుదాం

పాల ఉత్పత్తిలో ఆదిలాబాద్‌ను అగ్రభాగాన నిలుపుదాం

మంచిర్యాల : పాల ఉత్పత్తిలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అగ్రభాగాన నిలుపుతామని, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. గురువారం ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి మంచిర్యాల జిల్లాలోని  లక్షెట్టిపేట పట్టణంలో నిర్మించిన విజయ డెయిరీ మిల్క్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 కోట్ల రూపాయలతో 20 వేల లీటర్ల సామర్థ్యంతో పాల కేంద్రాన్ని నిర్మించామన్నారు.

ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా ఎంతో మందికి  ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికి ఉమ్మడి జిల్లాలో నిర్మాణమవుతున్న పాల కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నలమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, డీసీఎంస్ చైర్మన్ తిప్పని లింగన్న, మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డీడీ మల్లికార్జున, మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.