శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 11:04:05

స్వామి వివేకానందుడి అడుగుజాడల్లో నడుద్దాం.. : ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

స్వామి వివేకానందుడి అడుగుజాడల్లో నడుద్దాం.. : ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

వికారాబాద్‌ : భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటి చెప్పిన స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని, అందరు ఆయన అడుగుజాడల్లో నడవాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకొని స్థానిక గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుడు రామకృష్ణ మఠాన్ని స్థాపించి, దాని ద్వారా దేశ యువతకు దిశా నిర్దేశం చేశారన్నారు.

తన ఉపన్యాసాలతో దేశాన్ని జాగృతం చేయడమే కాకుండా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రపంచ వేదికల్లో ప్రసంగించి జాతి ఖ్యాతిని పెంచారన్నారు. నేటి యువత వివేకానందుని ఆలోచనలకు అనుగుణంగా నడవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, ఏఎంసీ చైర్మన్‌ విజయ్ కుమార్, పాక్స్‌ చైర్మన్ ముత్యం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌ కుమార్, క్రీడాశాఖ అధికారి హనుమంత్ రావు, ఎస్సీ కార్పొరేషన్ అధికారీ బాబు మోజెస్, డీటీడీఓ కొటాజి రావు, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


logo