మంగళవారం 02 జూన్ 2020
Telangana - May 15, 2020 , 17:19:18

పోతిరెడ్డిపాడు’ కోసం కలిసికట్టుగా పోరాడుదాం

పోతిరెడ్డిపాడు’ కోసం కలిసికట్టుగా పోరాడుదాం

మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ప్రాజెక్ట్ లు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని,విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని వ్యావసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన  ప్రెస్  మీట్ లో వారు మాట్లాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పుడిప్పుడే పాలమూరు జిల్లా బాగుపడుతున్నది

ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం కాదు  పాలమూరు బాగు గురించి, ప్రజల గురించి  ఆలోచించంచండని హితవు పలికారు. విపక్షాలు విమర్శలతో సాదించేది ఏం లేదని కర్ణాటక, మహారాష్ట్రలో ప్రతిపక్షాల వలె కలిసి వస్తే ప్రాజెక్టులు ఇంకా వేగంగా పూర్తి చేయవచ్చయని  సూచించారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తామన్నారు. సాగునీటి వివక్ష కారణంగా నే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని ఇవ్వాళ మాట్లాడుతున్న వారందరూ గతంలో చేసిన పనులన్నీ ప్రజలు మరచిపోలేద్న్నారు. జల దోపిడికి సద్దులు మోసిన వారు ఇవ్వాళ మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. 


logo