శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 27, 2020 , 14:35:25

పల్లెల్లాగే పట్టణాలను అభివృద్ధి చేసుకుందాం

పల్లెల్లాగే పట్టణాలను అభివృద్ధి చేసుకుందాం

సూర్యాపేట : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల అభివృద్ధి వలే పట్టణ ప్రగతితో పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నేడు హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 18, 19వ వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.





logo