హైదరాబాద్: నగరంలోని షేక్‌పేటలో ఘోరం జరిగింది. తాగిన మైకంలో సొంత తమ్ముడే అన్నను దారుణంగా హత్యచేశాడు. విజయ్, నరేందర్ అలియాస్ చిన్నా అన్నాతమ్ముళ్లు. ఆదివారం రాత్రి షేక్‌పేట నాలా వద్ద ఉన్న ఓ వైన్స్‌లో ఇరువురు మద్యం సేవించారు. ఈ సందర్భంగా అన్నదమ్ముల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. అదికాస్తా ముదరడంతో తమ్ముడు చిన్నా.. అన్న విజయ్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.