గురువారం 09 జూలై 2020
Telangana - Apr 25, 2020 , 10:46:03

ఈ ఫోన్‌ నెంబర్‌ను విస్తృత ప్రచారంలోకి తెద్దాం : కవిత

ఈ ఫోన్‌ నెంబర్‌ను విస్తృత ప్రచారంలోకి తెద్దాం : కవిత

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకుంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111కి ఫోన్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ నంబర్‌ను విస్తృత ప్రచారంలోకి తీసుకురావాల్సిందిగా మాజీ ఎంపీ కవిత నెటిజన్లను కోరారు. లాక్‌డౌన్‌ విపత్కరకాలంలో రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటిచ్చొందన్న సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ వలస కూలీలను, నిరుపేదలను ఆదుకుంటున్నారు. తాజాగా సీఎం కార్యాలయం తీసుకువచ్చిన ఈ సౌకర్యం ద్వారా ఏ ఒక్కరు ఆకలితో ఉండరని ఆమె పేర్కొన్నారు. 


logo