మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 15:56:32

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

కరీంనగర్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో  భాగంగా మంత్రి కొప్పుల మంగళవారం కరీంనగర్ తన క్యాంప్ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్‌ నగరంలోని 135వ డివిజన్, వెంకటాపుర్‌లో అందరం కలిసి కట్టుగా ప్రచారం చేద్దామన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెల్దాం. ప్రభుత్వ విజయాలతో పాటు, ప్రతిపక్ష వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామన్నారు.టీఆర్‌ఎస్‌ బలమేంటో ప్రతిపక్షాలకు చూపిద్దామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన మంత్రి ఆయా నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో ఏర్పడింది. రాష్ట్ర సాధనలో కష్టనష్టాలు, ఆటుపోట్లు, చేదు అనుభవాలను చూసిన పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు. అలాంటి పార్టీకి మనం అండగా ఉండాలన్నారు. సమావేశంలో ధర్మపురి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.