బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 17:14:58

ధైర్యంగా ఉందాం..కరోనాను కట్టడి చేద్దాం

ధైర్యంగా ఉందాం..కరోనాను కట్టడి చేద్దాం

ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి గ్రామంలో గల గిరిజన యువత శిక్షణా కేంద్రం (ITDA) లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ ను సోమవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా విషయంలో ఎవరు భయాందోళనకు గురికావాల్సిన పనిలేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ  దవాఖాన కాకుండా అదనంగా ఇక్కడ 70, మమత  దవాఖానలో 130 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 


శారద ఇంజినీరింగ్ కళాశాలలో కూడా కొవిడ్ హెల్త్ కేర్ ఏర్పాటు చేస్తామన్నారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని, తెలంగాణలో కరోనా బారిన పడి నయం అయిన వారి సంఖ్య 98.5% ఉండగా, మరణాలు 1.5% మాత్రమే అని వెల్లడించారు. కరోనా పై పోరాడుతున్న  వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ డీఎం హెచ్ వో మాలతి తదితరులు ఉన్నారు.logo