టీకాపై అపోహలు వీడండి

- అలర్జిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్
హన్మకొండ, జనవరి 24: కరోనా నియంత్రణకు రూపొందించిన టీకాల విషయంలో అపోహలు వీడాలని అలర్జిస్ట్, ఇమ్యూనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎస్ఎస్వీఎస్ కన్వెన్షన్ హాల్లో ‘కరోనా వ్యాక్సిన్‌పై వాస్తవాలు- అపోహలు’ అనే అంశంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శాస్త్రీయ పరిశోధనలు చేసి టీకాలను తయారుచేశారని చెప్పారు. ఇందులో మన దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లకు కేంద్రం అత్యవసర అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు. వ్యాధి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని పరీక్షలు చేసిన అనంతరమే వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారని అన్నారు. వ్యాక్సిన్ తొందరగా తయారు చేయలేదని, అనుమతులు మాత్రమే వెంట వెంటనే ఇచ్చారని స్పష్టంచేశారు. అంతమాత్రాన టీకాలపై తప్పుడు ప్రచారం తగదని చెప్పారు. ఏ వ్యాక్సిన్ తీసుకున్నా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం సహజమని, వ్యాక్సిన్ ప్రాణాలను కాపాడుతుందే తప్ప ప్రాణాలు తీయదని పేర్కొన్నారు.
కొవిషీల్డ్, కొవాగ్జిన్‌కు అంతర్జాతీయస్థాయి గుర్తింపు
కొవిషీల్డ్, కొవాగ్జిన్‌కు అంతర్జాతీయస్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని, వీటి కోసం ఇతర దేశాలు సైతం ఎదురుచూస్తున్నాయని డాక్టర్ నాగేశ్వర్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకొనే ముందు డాక్టర్‌కు ఆరోగ్య పరిస్థితి తెలియజేయాలని, దాని ప్రకారం చికిత్సను అందించి ఇబ్బంది లేకపోతే వ్యాక్సిన్ ఇస్తారని వివరించారు. దగ్గు, దమ్ము లాంటివి ఉన్నవారు పూర్తిగా తగ్గిన తర్వాతే టీకా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్, అలర్జీ తదితర వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18004250095 లో సంప్రదించాలని తెలిపారు.
తాజావార్తలు
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి
- ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారంపై కేటీఆర్ బహిరంగ లేఖ
- అక్షర్ ట్రిపుల్ స్ట్రైక్..ఇంగ్లాండ్ 56/5
- మహిళ ఉసురు తీసిన అద్వాన రోడ్డు.. బస్సు కిందపడి మృతి
- ఆ గొర్రెకు 35 కిలోల ఉన్ని..
- గులాబీమయమైన దొంగలమర్రి..
- ప్రభాస్ రికార్డు..సినిమాకు 100 కోట్ల పారితోషికం..!
- ఈ లిఫ్టుల ద్వారా నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు : మంత్రి హరీశ్
- పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి : యువతి బలవన్మరణం
- శ్రీరాముడి పేరిట వినూత్న బ్యాంకు.. ఎక్కడంటే