శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 19:43:34

క‌రోనా భ‌‌యం వీడండి..కలిసి కట్టుగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి

క‌రోనా భ‌‌యం వీడండి..కలిసి కట్టుగా ఎదుర్కొందాం : మంత్రి ఎర్రబెల్లి

వ‌రంగ‌ల్ :  క‌రోనా భ‌‌యం వీడండి. స‌ర్కార్ తోపాటు  ప్రజాప్రతినిధులుగా మేం అభ‌యం ఇస్తున్నాం..కేవ‌లం భ‌యం వ‌ల్లే అనేక మంది ఇబ్బందులు ప‌డుతున్నారని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసానిచ్చారు. క‌రోనా నేప‌థ్యంలో వైర‌స్ నివార‌ణ-పెంచాల్సిన వైద్య స‌దుపాయాల‌పై వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వతగిరి నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి మంత్రి సత్యవతి రాథో డ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్‌, ప‌సునూరి ద‌యాక‌ర్, మాలోత్ క‌విత‌, ఎమ్మెల్యేలు..డిఎస్ రెడ్యానాయ‌క్, శంక‌ర్ నాయ‌క్, ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి,  నన్నపనేని న‌రేంద‌ర్, ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు,  ఎంజీఎం సూపరింటెండెంట్,  వైద్యాధికారులు ఈ టెలీ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, క‌రోనా విస్తృతి రోజురోజుకూ పెరుగుతుందన్నారు. న‌గ‌రాల‌ నంచి పట్టణాల నంచి వేగంగా విస్తరిస్తుందన్నారు.  ‌కోవిడ్ కి భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. కొన్ని జాగ్రత్తలతో సులువుగా కోలుకోవ‌చ్చు. కరోనా నుంచి కోలుకున్నవారే ఇందుకు నిదర్శమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నిధులు కరోనా కోసం కేటాయించాలన్నారు. వ‌రంగ‌ల్  సెంట్రల్ జైలు ఆవ‌ర‌ణ‌లో నిర్మిత‌మైన పీఎంఎస్ఎస్ వై హాస్పిట‌ల్ ని వేగంగా అందుబాటులోకి తేవాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. 

ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చొర‌వ‌తో మ‌రిన్ని స‌దుపాయాలు స‌మ‌కూర్చుకోవాల‌ని  మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ నిర్ణయించారు. క‌రోనాతో ఎవ‌రికీ ఏమీ కాదు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి గ త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు.క‌ల్లాలు, గోదాములు, రైతు వేదిక‌లు మూడు నెల‌ల్లోగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.


logo